nithin: 'శ్రీనివాస కల్యాణం'లో నితిన్ జోడీగా నందిత శ్వేత

  • సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం'
  • దిల్ రాజు నిర్మాణంలో సెట్స్ పైకి 
  • నాయకా నాయికలుగా నితిన్ .. నందిత శ్వేత

 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో నటనాపరంగా నందిత శ్వేత మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, తెలుగులో ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఒక్క తెలుగు సినిమాకి కూడా నందిత శ్వేత సైన్ చేయలేదు.

దర్శకుడు సతీశ్ వేగేశ్న మాత్రం తన తాజా చిత్రంలో కథానాయికగా ఈ అమ్మాయిని తీసుకునే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో 'శతమానం భవతి' చేసిన సతీశ్ వేగేశ్న, అదే నిర్మాతతో కలిసి నితిన్ హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా నందిత శ్వేతను ఎంపిక చేయనున్నారు. ఈ సినిమాతోనైనా ఇక్కడ ఈ సుందరి జోరు కొనసాగుతుందేమో చూడాలి.  

More Telugu News