kalyan ram: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కల్యాణ్ రామ్ .. కొత్త దర్శకుడికి ఛాన్స్

షార్ట్స్‌లో చూడండి
కల్యాణ్ రామ్ ఒక వైపున విభిన్నమైన సినిమాలను నిర్మిస్తూ .. మరో వైపున విలక్షణమైన పాత్రలను పోషిస్తూ ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో 'ఎమ్మెల్యే' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ నటిస్తోంది.

 ఇక జయేంద్ర దర్శకత్వంలో 'నా నువ్వే' చేస్తుండగా .. ఆయన జోడీగా తమన్నా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే కల్యాణ్ రామ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నూతన దర్శకుడు విజయ్ వినిపించిన కథ నచ్చడంతో, వెంటనే కల్యాణ్ రామ్ ఓకే చెప్పేశాడట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొనసాగే ఈ సినిమాని, 'ఎమ్మెల్యే' మూవీ నిర్మాతలే నిర్మిస్తారట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    
Go Back to Shorts
kalyan ram

More Telugu News