Uttarakhand: అతిథులకు టీ, స్నాక్స్‌ కోసం రూ.68,59,865 ఖర్చు చేసిన ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం!

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్‌ రావత్ గతేడాది మార్చి 18న ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే సుమారు ప‌ది నెలల్లో ఆయ‌న అతిథులకు టీ, స్నాక్స్‌ కోసం రూ.68,59,865 ఖర్చుపెట్టారు. సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా దానికి స్పందించిన ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది.

 ఈ లెక్కన సగటును నెలకు దాదాపు ఆ ప్రభుత్వం ఏడు లక్షల రూపాయల మొత్తాన్ని కేవలం టీ, స్నాక్స్ కే ఖర్చు చేసింది. ఇక టీ, స్నాక్స్ కోసం రోజుకి ఎంత ఖర్చు చేసిందన్న విషయానికి వస్తే సెలవు రోజులతో కలుపుకుని రోజుకు దాదాపు 23,000 రూపాయలు ఖర్చు చేసిందన్న మాట. 
Go Back to Shorts
Uttarakhand
cm
tea
snacks

More Telugu News