తమ ఫోన్ ను నేలకేసి కొట్టి దుర్భాషలాడిందంటూ.. యాంకర్ అనసూయపై మహిళ ఫిర్యాదు!
- సెల్ఫీ దిగాలనుకున్న బాలుడు
- ఫోన్ లాక్కుని పగలగొట్టిన అనసూయ
- తల్లీకొడుకులపై దుర్భాషలు
తమ మొబైల్ ద్వారా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించగా... ఇది గమనించిన అనసూయ ఆగ్రహంతో బాలుడి చేతిలోని ఫోన్ ను లాక్కుని, నేలకేసి కొట్టింది. జరిగిన ఘటనతో తల్లీకుమారులు ఇద్దరూ బిత్తరపోయారు. ఫోన్ ఎందుకు పగలగొట్టావని బాలుడి తల్లి ప్రశ్నించగా... సమాధానం చెప్పకుండానే, వారిని దుర్భాషలాడుతూ అనసూయ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమను చాలా గలీజు మాటలతో తిట్టిందని ఫిర్యాదులో పేర్కొంది.