మాల్దీవుల్లో ముదిరిన సంక్షోభం.. రెండు వారాలపాటు ఎమర్జెన్సీ.. సుప్రీం న్యాయమూర్తుల అరెస్ట్!
- దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన అధ్యక్షుడు
- ఈ తెల్లవారుజామున సుప్రీం న్యాయమూర్తుల అరెస్ట్
- సుప్రీం ఆదేశాలతో దేశంలో రాజకీయ సంక్షోభం
ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలంటూ సుప్రీం ఆదేశించిన తర్వాత మాజీ అధ్యక్షుడు నషీద్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో రాజధాని మాలిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కోర్టు ఆదేశాలను పాటిస్తామన్న పోలీస్ చీఫ్ అహ్మద్ అరిఫ్‌ను ప్రభుత్వం తొలగించింది. కాగా, దేశంలో అత్యవసర స్థితిని విధించిన ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్లా సయీద్, అలీ హమీద్‌లను ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసింది.