Drunk: పీకల దాకా తాగి.. మాజీ ప్రియుడి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్‌!

షార్ట్స్‌లో చూడండి
పీకల దాకా తాగిన ఓ యువతి తన మాజీ ప్రియుడి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసిన ఘటన హర్యానాలోని పటౌడిలో చోటు చేసుకుంది. అంతేకాదు, మ్యూజిక్, పాటల కోసం డీజేను కూడా తీసుకెళ్లింది. రాజా హిందూస్థానీ సినిమాలోని 'తేరే ఇష్క్ మే' పాట పెట్టుకుని గంతులేసింది. దీంతో స్థానికులంతా అక్కడ గూమిగూడారు.

అయినప్పటికీ డ్యాన్స్ చేస్తూ హల్‌చల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఆ అమ్మాయితో ప్రేమాయణం జరిపిన ఓ యువకుడు కొన్ని రోజులుగా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె ఇలా ప్రవర్తించినట్లు సమాచారం.   
Go Back to Shorts
Drunk
girl
Haryana
dance
Viral Videos

More Telugu News