actor hari: కిడ్నాప్ కేసులో తమిళ సినీ నటుడు అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేసిన కేసులో తమిళ నటుడు హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని వాణియంబాడి టీచర్స్ కాలనీకి చెందిన సెంథిల్ కుమార్ ఆదర్శ్ మాట్రిక్ స్కూల్ లో కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. జనవరి 19న ఆయన బైక్ పై వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి తన అన్నయ్య ఉదయచంద్రన్ కు సెంథిల్ ఫోన్ చేసి, తాను కిడ్నాప్ కు గురైనట్టు చెప్పారు. తనను విడిచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని ఉదయచంద్రన్ వెంటనే పోలీసులకు తెలిపారు.

ఆ తర్వాత రూ. 50 లక్షల నగదు తీసుకుని కారిమంగళం అనే ప్రాంతానికి ఉదయచంద్రన్ వెళ్లారు. పోలీసులు కూడా అతనిని వెంబడించారు. ఈ నేపథ్యంలో, కిడ్నాపర్లు ఉపయోగించిన కారు ఆధారంగా రెడ్ హిల్స్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణలో అసలు సూత్రధారి నటుడు హరి అని తేలింది. పలు సినిమాల్లో అతను విలన్ గా నటించాడు. ఓ జిమ్నాస్టిక్ సెంటర్ కూడా నడుపుతున్నాడు. హరి భార్య ప్రియ గత 12 ఏళ్లుగా సెంథిల్ కుమార్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో, సెంథిల్ ను హరి కిడ్నాప్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
Go Back to Shorts
actor hari
tamil actor
kidnap

More Telugu News