హైదరాబాద్ లో గ్రహణ బలి?... భవనంపై మొండెం లేని చిన్నారి తల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో గ్రహణ బలి?... భవనంపై మొండెం లేని చిన్నారి తల!

  • ఓ డాబాపై మొండెం లేని తల
  • ఆ ఇంటి చుట్టూనే తిరిగిన జాగిలాలు
  • మొండెం కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్ పరిధిలోని చిలుకానగర్ లో ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటిపై మొండెం లేని చిన్నారి తల కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహం కావడంతో, ఎవరో నరబలికి పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు, కేసును సీరియస్ గా తీసుకుని మొండెం కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో నివసించే రాజశేఖర్ అనే వ్యక్తి కుటుంబం గురువారం ఉదయం మేడారం జాతరకు వెళ్లే క్రమంలో, ఆయన అత్త ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లగా, చిన్నారి తల కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

 తలపై కుడి చెవి పూర్తిగా తెగిపోయి ఉండటం, దవడపై కత్తిగాట్లతో నరబలిగా అనుమానించారు. చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు సమీపంలోని డ్రైనేజీల్లో సైతం మొండెం కోసం గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఏ పోలీసు స్టేషన్ లోనూ చిన్నారి అదృశ్యం ఫిర్యాదు నమోదు కాలేదని వెల్లడించిన పోలీసులు, ఏదైనా వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగివుండవచ్చన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, పోలీసు జాగిలాలు ఆ ఇంటి చుట్టూనే తిరగడం అనుమానాలను పెంచుతోంది. ఓ ఇంట్లోని దేవుడి గది వరకూ కూడా జాగిలాలు వెళ్లడం గమనార్హం. దీంతో పోలీసులు ఆ చుట్టుపక్కల వారిని అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నిస్తున్నారు.
Murder
Hyderabad
Baby Boy

More Telugu News