24 కొత్త మెడికల్ కాలేజీలు.. జిల్లా ఆసుపత్రుల ఆధునీకరణ: జైట్లీ బడ్జెట్
- రూ. లక్ష కోట్ల కేటాయింపు
- టెక్నాలజీని పెంచుతాం
- బ్లాక్ బోర్డులను డిజిటల్ బోర్డులుగా మారుస్తాం
ఉపాధ్యాయలకు శిక్షణ ఇవ్వడం, ట్రైబల్ విద్యార్థుల స్కూళ్ల సంఖ్యను పెంచడంపై దృష్టి సారిస్తామని జైట్లీ చెప్పారు. కనీసం 20 వేల మంది గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో, జనాభాలో 50 శాతానికి మించి ఎస్టీలు ఉండే ప్రాంతాల్లో 'ఏకలవ్య' స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నవోదయా విద్యాలయాలతో కలసి ఇవి పని చేస్తాయని చెప్పారు. విద్యాసంస్థల్లో డిజిటల్ టెక్నాలజీని పెంచుతామని... బ్లాక్ బోర్డులను క్రమంగా డిజిటల్ బోర్డులుగా మార్చుతామని జైట్లీ తెలిపారు.