kalyan: చిరూ చిన్నల్లుడి సినిమా మొదలైపోయింది!

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. దాంతో మెగా అభిమానులంతా ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెర దింపేస్తూ ఈ ప్రాజెక్టును కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.

వారాహి చలన చిత్ర కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా.. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. సెంథిల్ కుమార్ ఈ సినిమాకి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండటం విశేషం. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణ్ జోడీగా మాళవిక నాయర్ ను తీసుకున్నారు. యోగేష్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.  
Go Back to Shorts
kalyan
malavika

More Telugu News