ఒకే వేదికపై కంగనా, కరణ్ జొహార్... గొడవలు మర్చిపోయారా?
- 'ఇండియాస్ నెక్స్ట్ సూపర్‌స్టార్' కార్యక్రమంలో పాల్గొన్న కంగనా
- వాదనలు వ్యక్తిగతం కాదన్న కంగనా
- హృతిక్ రోషన్ గురించి పరోక్షంగా ప్రస్తావించిన నటి
ఈ క్రమంలో ఈ కార్యక్రమం గురించి ఇవాళ మీడియాతో మాట్లాడిన కంగనా... తమ ఇద్దరి మధ్య గతంలో జరిగిన వాగ్వివాదం కేవలం సినీరంగానికి సంబంధించిన సమస్యలపైనే గానీ... వ్యక్తిగతమైనది కాదని, తమ మధ్య కొత్త స్నేహం, పాత స్నేహం అంటూ లేవని, ఎప్పటిలాగే ఉన్నామని కంగనా అంది. అలాగే స్వాభిమానం గురించి తన అభిప్రాయాలు కూడా మారలేదని ఆమె చెప్పింది. ఇదిలా ఉండగా.. కార్యక్రమంలో హృతిక్ రోషన్ గురించి కంగనా పరోక్షంగా ప్రస్తావించడం హైలైట్‌గా నిలిచింది. మీ లవ్‌స్టోరీ గురించి చెప్పాలని అడగ్గా.. తన లవ్‌స్టోరీ గురించి అందరికీ తెలుసునని, మీడియాలో గొప్ప గొప్ప కథనాలు కూడా వచ్చాయని కంగనా జోకు వేసింది.