Chiranjeevi: చిరంజీవి నెక్స్ట్ మూవీకి దర్శకుడు ఆయనేనట!

షార్ట్స్‌లో చూడండి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం షూటింగ్ పనుల్లో చిరంజీవి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే చిత్రంలో చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాకు సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

‘రంగస్థలం’ సినిమా సెట్స్ కు పలు సందర్భాల్లో చిరంజీవి వెళ్లారు. ఆయా సందర్భాల్లోనే చిరంజీవితో కొత్త చిత్రం గురించి చర్చించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రెండో షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Ramcharan
sukumar

More Telugu News