nayanatara: నయనతార తీరు ఆగ్రహాన్ని తెప్పించిందట!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో తెరపై మొదట్లో గ్లామర్ మెరుపులు మెరిపించిన నయనతార, ఆ తరువాత నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ, తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో నయనతార చేసిన సినిమాలు ఆమెకి వరుస విజయాలను అందిస్తూ వస్తున్నాయి. రెండు భాషల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఆమె, తాజాగా తెలుగు అభిమానుల ఆగ్రహానికి లోనైంది.

 రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో "మీ అభిమాన హీరోలు ఎవరు?" అనే ప్రశ్న నయనతారకి ఎదురుకాగా, ఆమె అజిత్ .. విజయ్ పేర్లు చెప్పిందట. తెలుగు దర్శక నిర్మాతలు .. హీరోలు నయనతారను ఎంతగానో ప్రోత్సహించారు. అవేమీ గుర్తుపెట్టుకోకుండా ఆమె తమిళ హీరోల పేర్లు మాత్రమే చెప్పడంతో, తెలుగు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. నయనతార తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పేముందనే వాదన కూడా వినిపిస్తూ ఉండటం విశేషం.  
Go Back to Shorts
nayanatara

More Telugu News