సుప్రీంకోర్టులో ఆ నాలుగు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ పిటిషన్
- 'పద్మావత్' ప్రదర్శన బాధ్యత రాష్ట్రాలదే అన్న సుప్రీం
- నాలుగు రాష్ట్రాల్లో విడుదల కాని సినిమా
- వీటిపై కోర్టు ధిక్కరణ పిటిషన్
ఈ నేపథ్యంలో, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం ద్వారా, కోర్టు ధిక్కరణకు ఈ నాలుగు రాష్ట్రాలు పాల్పడ్డాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు భద్రతా చర్యలను చేపట్టడంలో ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు, రాజ్ పుత్ కర్ణిసేనకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులపై కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.