Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,210, విజయవాడలో రూ.31,060, చెన్నైలో రూ.30,390గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,900, విజయవాడలో రూ.28,800, చెన్నైలో రూ.28,950గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,900, విజయవాడలో రూ.40,700, చెన్నైలో రూ.42,200 వద్ద ముగిసింది.