'పద్మావత్' ప్రీమియర్‌కి జంటగా హాజరైన దీపిక, రణ్‌వీర్.. ఫొటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు
- చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తూ అందరినీ ఆకట్టుకున్న జంట
- శ్వేతవర్ణ వస్త్రాల్లో హాజరైన ప్రేమ పక్షులు
- హాజరైన షాహిద్ కుటుంబం
మరోవైపు ఈ సినిమాలో నటించిన షాహిద్ కపూర్ కుటుంబం కూడా ప్రీమియర్ షోకి హాజరైంది. షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్, సోదరుడు ఇషాన్ ఖట్టర్, తల్లి నీలిమా అజీమా, తండ్రి పంకజ్ కపూర్, పంకజ్ మరో భార్య సుప్రియా పాఠక్, పంకజ్ కూతురు సనా కూడా ప్రీమియర్ షోకి హాజరయ్యారు. ఇదిలా ఉండగా తీవ్ర ఆందోళనలు, నిరసనలు, వివాదాల మధ్య విడుదలైన 'పద్మావత్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.