జపాన్ ను దాటేయనున్న భారత్... పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయం
- జపాన్ ను దాటుకుని ఐదో స్థానానికి భారత్
- నిపుణుల అంచనాలు
- 2018లో మరింత వృద్ధికి అవకాశాలు
- ప్రైస్ వాటర్ హౌస్ నివేదిక
అమెరికా, చైనాలు పెట్టుబడుల ఆకర్షణకు మొదటి రెండు స్థానాల్లో ఉంటాయని, అమెరికాలో వృద్ధి మరింత వేగాన్ని సంతరించుకుంటుందని పేర్కొంది. చైనా తన పాప్యులారిటీని పెంచుకుంటుందని, భారత్ తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకుని జర్మనీ, బ్రిటన్ తో సమానంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని సర్వే స్పష్టం చేసింది. దావోస్ లో అంతర్జాతీయ ఆర్థిక పోరం సమావేశం నేపథ్యంలో ఈ నివేదిక విడుదల కావడం గమనార్హం. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న జపాన్ ఆరుకు పడిపోనుంది. బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉంటాయి.