Uttam Kumar Reddy: డిసెంబరులోనే ఎన్నికలు వచ్చే వాతావరణం ఉంది: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఈ ఏడాది డిసెంబ‌రులోనే అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే వాతావ‌ర‌ణం క‌న‌ప‌డుతోందని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. త‌మ పార్టీ త్వర‌లోనే బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నుంద‌ని తెలిపారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలపై జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. త్వరలో ఇతర పార్టీల‌ నుంచి త‌మ పార్టీలోకి భారీగా చేరిక‌లు జ‌రుగుతాయ‌ని అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకే కాంగ్రెస్‌లోకి చేరికలు పెరుగుతున్నాయ‌ని చెప్పారు.

వచ్చే డిసెంబరులో ఎన్నికలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నందున కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ నేత‌లు ఇప్ప‌టి నుంచే కృషి చేయాల‌ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.    
Go Back to Shorts
Uttam Kumar Reddy
elections
Telangana

More Telugu News