Pawan Kalyan: ముద్రగడతో భేటీ కానున్న పవన్ కల్యాణ్?

షార్ట్స్‌లో చూడండి
2019 ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. ఓవైపు జనసేన క్యాడర్ ను పెంచుతూనే, మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. తాజాగా కాపు నేత ముద్రగడ పద్మనాభంతో భేటీకి పవన్ సిద్ధమవుతున్నారు. జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య ఇటీవల చడీచప్పుడు లేకుండా ముద్రగడను కలిశారు.

పవన్ దూతగా తాను వచ్చానని చెప్పిన ఆయన... పలు అంశాలపై ముద్రగడతో చర్చలు జరిపారు. పార్టీ నిర్మాణం, రిజర్వేషన్లపై సలహాలు, రాజకీయ వ్యూహాలపై సూచనలు తీసుకున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ మిమ్మల్ని కలుస్తారని చెప్పారు. వాస్తవానికి ముద్రగడతో జనసేనకు ఇప్పటి వరకు సంబంధాలు లేవు. కాపు ఉద్యమం సమయంలో కూడా ముద్రగడ, పవన్ లు కలవలేదు. కనీసం మాట్లాడలేదు. అయితే, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ కలవబోతుండటం ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
Pawan Kalyan
mudragada padmanabham
Jana Sena

More Telugu News