charan: చరణ్ కి అన్నయ్య పాత్రలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్!

షార్ట్స్‌లో చూడండి
బోయపాటి శ్రీను .. చరణ్ కాంబినేషన్లోని సినిమా నిన్ననే రెగ్యులర్ షూటింగుకి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో బలమైన విలన్ గా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. కథానాయికగా కైరా అద్వాని చేయనుండగా కీలకమైన పాత్రలో స్నేహ నటించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.

శంకర్ దర్శకత్వంలోని 'జీన్స్' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రశాంత్, ఆ తరువాత కెరియర్ పరంగా ఆ స్పీడ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ సినిమాలో ఆయన చేయనున్నాడు అనగానే .. ఆ పాత్ర ఏమై ఉంటుందా అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో ఆయన చరణ్ కి అన్నయ్యగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.   
Go Back to Shorts
charan
prashanth

More Telugu News