నేడు ఎన్టీఆర్ వర్ధంతి: నక్లెస్ రోడ్డుకు క్యూ కట్టిన బాలకృష్ణ, హరికృష్ణ, జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్!
- ఎన్టీఆర్ ఘాట్ కు కుటుంబ సభ్యులు
- పుష్పగుచ్ఛాలుంచి నివాళులు
- 'తెలుగుజాతి గుండె చప్పుడు ఎన్టీఆర్' అన్న బాలయ్య
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తని కొనియాడారు. తెలుగు ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు.