devineni uma: ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేనికి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు లేఖ
ఆర్డీఎస్ ఆధునికీకరణ పనుల్లో సహకారంపై ఏపీ చొరవ చూపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. ఆ పనులను ఈ ఏడాది జులైలోగా పూర్తి చేయాలని తాము అనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 4న కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ తెలంగాణ పర్యటన సందర్భంగా ఈ విషయంపై తాము పలు నిర్ణయాలు తీసుకున్నామని, హైదరాబాద్‌లో మరోసారి నిర్వహించే సమావేశంలో ఏపీ కూడా పాల్గొనాలని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక , ఏపీ ఆయకట్టుదారుల ప్రయోజనాల దృష్ట్యా ఏపీ చొరవ చూపాలని, త్వరలో ఏర్పాటు చేసే సమావేశానికి రావాలని కోరారు.