సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

  • సుప్రీంకోర్టులో పరిస్థితి సజావుగా లేదని న్యాయమూర్తులు మీడియా ముందుకు
  • ఈ విషయం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారం- కేంద్ర ప్రభుత్వం
  • సుప్రీంకోర్టులో ఈ పరిణామం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి ముప్పు
  • ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలి
సుప్రీంకోర్టులో పరిస్థితి సజావుగా లేదంటూ, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వ‌హించి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ విషయం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారమని, అందులో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

సుప్రీంకోర్టులో ఈ పరిణామం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి ముప్పు వాటిల్లేలా ఉందని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. కాగా, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ సుప్రీంకోర్టు ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో ప‌రిస్థితుల‌ను త‌క్ష‌ణం స‌రిదిద్దాల‌ని, లేక‌పోతే దేశ ప్ర‌జ‌ల‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్న విషయం తెలిసిందే.      
Go Back to Shorts
Supreme Court
government
judges

More Telugu News