పారిస్ లో ఫైవ్ స్టార్ హోటల్‌లో దోపిడీ.. రూ.38,66,69,250 విలువజేసే వజ్రాభరణాలు చోరీ!
- పారిస్‌లో కలకలం
- దుండగుల కాల్పుల్లో ఒకరికి గాయాలు
- ముగ్గురిని పట్టుకున్న పోలీసులు
దొంగలు ప్రవేశించారన్న భయంతో అందరూ కిచెన్‌లో దాక్కుని ఉండిపోయారు. హోటల్ లోని ప్రముఖ ఆభరణాల షోరూం డిస్ప్లేలను పగులగొట్టిన దొంగలు ఆభరణాలను సంచుల్లోకి కూరుకుని ఉడాయించారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దొంగలు మాయమయ్యారు. అయితే, చట్టుపక్కల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ముగ్గురు దొంగలను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.