ఎన్టీఆర్ పక్కనే ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలని బాపు గారిని అడిగాను: కోట శంకర్ రావు
- ఒక రోజున బాపు గారి ఇంటికి వెళ్లాను
- ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ ఇవ్వమని అడిగాను
- ఆ అవకాశాన్ని .. అదృష్టాన్ని అయన కల్పించారు
"అలా ఒకసారి వాళ్లింటికి వెళ్లి ఎన్టీ రామారావుగారితో సినిమా చేస్తున్నారు గదా .. అలాగే మీ దర్శకత్వంలోను చేయలేదు .. ఈ సినిమాలో అవకాశం ఇవ్వండి' అని అడిగాను. వెండితెరపై ఒక ఫ్రేమ్ లో రామారావుగారితో కలిసి కనిపించే ఛాన్స్ ఇవ్వండి చాలు అన్నాను. ఆ మాటకు బాపు గారు నవ్వుకుని అలాగే అన్నారు .. అన్నట్టుగానే చిన్న పాత్ర ఒకటి ఇచ్చారు. ఆ పాత్ర కారణంగా 11 రోజుల పాటు రామారావుగారితో కలిసి గడిపే అవకాశం .. అదృష్టం దక్కాయి' అని చెప్పుకొచ్చారు.