agnathavasi: 'అజ్ఞాత‌వాసి' సినిమాలోంచి ఆ పాట‌ను తీసేయాల్సిందే.. ఇరు రాష్ట్రాల్లోని కోటేశ్వ‌ర‌రావులంద‌రూ ఏకం కావాలి: న‌్యాయ‌వాది

  • రేపు ప‌వ‌న్ క‌ల్యాణ్ 'అజ్ఞాత‌వాసి' విడుదల
  • మాచ‌వ‌రం పీఎస్ లో కొడకా కోటేశ్వరరావు పాటపై ఫిర్యాదు
  • మా అన్న‌య్య పిల్ల‌లు, అక్క‌య్య పిల్ల‌లు నన్ను హేళన చేస్తున్నారు
  • నాకు చాలా బాధేస్తోంది: న్యాయవాది కోటేశ్వరరావు

విడుద‌లకు సిద్ధ‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ 'అజ్ఞాత‌వాసి' సినిమాపై మ‌రో వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమాలోని 'కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు' పాట‌పై మాచ‌వ‌రం పీఎస్ లో కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో కోటేశ్వ‌ర‌రావు మీడియాతో మాట్లాడుతూ... "నాకు సినిమా నాలెడ్జ్ త‌క్కువ. ఇంటి నుంచి కోర్టుకు.. కోర్టు నుంచి ఇంటికి.. ఇదే నా వ్యాపకం. ఈ మ‌ధ్య మా అన్న‌య్య పిల్ల‌లు, అక్క‌య్య పిల్ల‌లు మా ఇంటికి వ‌చ్చారు.. వారు మ‌న బాబాయి పేరు కోటేశ్వ‌ర‌రావు క‌ద‌రా అని మాట్లాడుకుంటున్నారు. నా ముందే కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు అని పాట పాడుతున్నారు. నాకు చాలా బాధేసింది.

స్కూల్లో పాఠాలు చెప్పుకునే టీచర్ల పేర్లు కూడా కోటేశ్వరరావు అని ఉంటాయి. వారు తలెత్తుకుని స్కూలు కెలా వెళతారు? అందరూ ఎగతాళి చేస్తోంటే మేమెలా బతికేది? నాతో పాటు ఇరు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావులు అంద‌రూ క‌దిలిరండి. ఈ పాట‌ను ఆ సినిమాలోంచి తీసేయాల్సిందే. నాతో పాటు అనేక ప్రాంతాల్లోని కోటేశ్వ‌రరావులంద‌రూ ఏకమ‌వుతారు" అని పేర్కొన్నారు.  

More Telugu News