trisha: త్రిషపై చర్యలు తీసుకోండి.. నడిఘర్ సంఘంలో నిర్మాత ఫిర్యాదు!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ అగ్ర‌ హీరోల‌తో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌కే ప‌రిమిత‌మై పోయింది. కాగా, గ‌తంలో సామి అనే సినిమాని చేసి మెప్పించిన‌ న‌టుడు విక్రమ్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా హరి దర్శకత్వంలో సామి 2 తీస్తున్నాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషని ఎంపిక చేయగా, కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న త్రిష కొన్ని కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది. దీంతో త్రిష తమకు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టిందని, చర్యలు తీసుకోవాలని నిర్మాత శిబు థమీన్స్.. నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది.    
Go Back to Shorts
trisha
shibu thamins
kollywood

More Telugu News