సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- ప్లాన్స్ వర్కౌట్ కావంటున్న కాజల్
- తదుపరి చిత్రం పనుల్లో విక్రంకుమార్
- అనుష్క 'భాగమతి'కి రికార్డు వ్యూస్
- హిందీ సినిమాలో నటించనున్న శివాజీ?
* ఇటీవల అఖిల్ అక్కినేనితో 'హలో' చిత్రాన్ని చేసిన దర్శకుడు విక్రం కుమార్ తన తదుపరి చిత్రాన్ని నాగ చైతన్యతో చేయనున్నాడు. ఈ విషయాన్ని తనే తాజాగా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని విక్రం చెప్పాడు.
* అనుష్క ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న 'భాగమతి' చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది విడుదలైన మొదటి మూడు గంటల్లోనే ఒక మిలియన్ (పది లక్షలు) డిజిటల్ వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా పట్ల ఎంతటి క్రేజ్ వుందో అర్థం అవుతుంది. 'పిల్ల జామీందార్' ఫేం అశోక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
* ఇటీవల ఆర్టిస్టుగా గ్యాప్ తీసుకున్న హీరో శివాజీ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించనున్నాడు. అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే హీరో హీరోయిన్లుగా రూపొందే సినిమాలో శివాజీ నెగటివ్ టచ్ తో సాగే పాత్ర పోషిస్తాడట.