Chandrababu: ఏపీ చంద్రబాబు చేతిలో ఉండటమే మంచిది!: కోట శ్రీనివాసరావు

  • ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు
  • మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు
  • ఏపీని ఆయన తప్పా ఇంకెవరు అభివృద్ధి చేయగలరు?
  • ఓ ఇంటర్వ్యూలో బీజేపీ నేత, నటుడు కోట శ్రీనివాసరావు
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ చంద్రబాబు చేతిలో ఉండటమే మంచిదని బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఉన్న విషయం చెబుతున్నాను..చంద్రశేఖర్ రావుగారి అదృష్టమేంటంటే..ఒలిచి ఇచ్చిన అరటిపండును చేతిలో పెట్టినట్టు రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. కనుక, రాష్ట్రాన్ని పరిపాలించడం ఆయనకు కొంత తేలికే. సమాధానం కూడా గట్టిగా చెప్పగలరు. కొద్దోగొప్పో అభివృద్ధి చెందిన రాష్ట్రం.

ఇక ఆంధ్ర రాష్ట్రం అంటే.. ఆకులు పట్టుకుని విస్తరి తయారు చేసుకోవడమే కదా!  నా లెక్క ప్రకారం..హైదరాబాద్ లో ఉన్న రోడ్ల లాగా బెజవాడ, అమరావతిలో రావాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు పడుతుంది. ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు. ఏపీ ఆయన చేతిలో ఉండటమే మంచిది. అంతకన్నా ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఆయన తప్పా ఇంకెవరు అభివృద్ధి చేయగలరు?’ అని చెప్పుకొచ్చారు.
Chandrababu
kota srinivas

More Telugu News