'జీరో' చిత్ర షూటింగ్‌కి హాజ‌రైన అనుష్క‌ శర్మ... పూల‌తో ఆహ్వానించిన యూనిట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జీరో' చిత్ర షూటింగ్‌కి హాజ‌రైన అనుష్క‌ శర్మ... పూల‌తో ఆహ్వానించిన యూనిట్‌!

  • ఫొటోలు షేర్ చేసిన న‌టి
  • ద‌క్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన అనుష్క‌
  • పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి షూటింగ్‌లో
పెళ్లి, హ‌నీమూన్‌, మొద‌టి రిసెప్ష‌న్‌, రెండో రిసెప్ష‌న్‌, రెండో హ‌నీమూన్‌... ఇలా అన్ని ప‌నులు పూర్త‌య్యాక అనుష్క శ‌ర్మ తిరిగి షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వ‌డం ప్రారంభించింది. ప్ర‌స్తుతం షారుక్ స‌ర‌స‌న ఆమె న‌టిస్తున్న 'జీరో' చిత్ర షూటింగ్‌లో ఆమె పాల్గొంది. పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి షూటింగ్ సెట్లో అడుగుపెట్టిన అనుష్క శ‌ర్మ‌కు చిత్ర యూనిట్ రంగురంగుల‌ పూల‌తో స్వాగతం ప‌లికింది.

ఆమె కార‌వ్యాన్‌ని పూల‌కుండీలు, త‌మ జంట ఫొటోల‌తో అందంగా అల‌క‌రించిన ఫొటోలను అనుష్క సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. త‌న‌కు అంత అంద‌మైన స్వాగ‌తం ప‌లికినందుకు చిత్ర‌యూనిట్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్‌, అనుష్క‌, క‌త్రినా కైఫ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో 'జీరో' చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.
 
Anushka Sharma
zero
Shahrukh Khan

More Telugu News