యువతికి యువకుడు సాయపడితే అదేనా? కాస్త ఎదగరా బాబూ: 'కత్తి'కి బన్నీ వాసు కౌంటర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువతికి యువకుడు సాయపడితే అదేనా? కాస్త ఎదగరా బాబూ: 'కత్తి'కి బన్నీ వాసు కౌంటర్

  • పేరు చెప్పకుండా కత్తి మహేష్ కు కౌంటర్
  • తప్పుడు బంధం ఉందని అనుకోవద్దని సలహా
  • నిన్న సంచలన ఆరోపణలు చేసిన కత్తి
డైరెక్టుగా పేరును చెప్పకుండా సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ కు కౌంటరిచ్చాడు బన్నీ వాసు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, "ఏ విధమైన సంబంధమూ లేని ఓ యువతికి యువకుడు సాయపడ్డాడంటే, వారిద్దరి మధ్యా ఏదో తప్పుడు బంధం ఉందని అర్థం చేసుకుంటే ఎలా? కాస్త ఎదగరా బాబూ" అని వ్యాఖ్యానించాడు. నిన్న కత్తి మహేష్, మీడియా ముందుకు వచ్చి పవన్ కల్యాణ్, పూనం కౌర్ మధ్య ఏదో బంధముందని, వారిద్దరూ గుళ్లలో తిరిగారని, ఆ బంధం తెగిన ఆందోళనతోనే పూనం ఆత్మహత్యాయత్నం చేసిందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏ ఘటననూ, కత్తి పేరును ప్రస్తావించకుండా బన్నీ వాసు చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతోంది.
Kathi Mahesh
Banny Vasu
Facebook

More Telugu News