Rail: అడవి ఆవుల మందను ఢీకొట్టి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నాలుగు గంటలపాటు నిలిచిపోయిన రాకపోకలు

షార్ట్స్‌లో చూడండి
కడప నుంచి గుత్తి వైపు వెళ్తున్న గూడ్సు రైలు చిత్రావతి వంతెన సమీపంలో అడవి ఆవుల మందను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను సరిచేసేందుకు నాలుగు గంటల సమయం పట్టింది. ఫలితంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కోవలం-హైదరాబాద్, చెన్నై-ముంబై మధ్య ప్రయాణించే మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి.

ఇక, ఈ ప్రమాదంలో ఏడు ఆవులు మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. చిత్రావతి వంతెన దాటిన తర్వాత ఆవుల మంద ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో ఈ ఘటన జరిగినట్టు లోకో పైలట్ తెలిపారు. పట్టాలు తప్పిన కంటైనర్‌ను తిరిగి పట్టాలపైకి చేర్చి, ట్రాక్‌ను పునరుద్ధరించాక రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. 
Go Back to Shorts
Rail
Kadapa
cows
Track
trains

More Telugu News