త్యాగరాజస్వామి కీర్తన మధ్యలో వాణిజ్య ప్రకటన... దూరదర్శన్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం!
- పంచరత్న కీర్తనల మధ్యలో బ్రేక్
- కాసేపు కూడా ఆగలేరా? అంటూ అసహనంతో ట్వీట్
- స్పందించిన ప్రసార భారతి
- పొరపాటు జరిగిందని వివరణ
ట్విట్టర్ ద్వారా దూరదర్శన్‌కు తన అసహనాన్ని తెలియజేశారు. దూరదర్శన్‌ను ట్యాగ్ చేస్తూ ‘యో డీడీ నేషనల్ ఏంటిది? కీర్తన పూర్తయ్యే వరకు ఆగలేరా? కీర్తన మధ్యలో ఈ ప్రకటనలేంటి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ట్వీట్‌కు స్పందించిన ప్రసారభారతి సీఈవో ఎస్ఎస్ వేంపాటి వివరణ ఇస్తూ.. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.