నోట్ల రద్దు కారణంగా తగ్గిన తిరుమల తిరుపతి దేవస్థాన హుండీ ఆదాయం
- దాదాపు రూ. 50 కోట్లు తగ్గిన హుండీ ఆదాయం
- పెరిగిన ఆన్‌లైన్ డొనేషన్లు
- వెల్లడించిన టీటీడీ
మరోవైపు ఆన్‌లైన్ డొనేషన్లు పెరిగినట్లు టీటీడీ ప్రకటించింది. 2016లో ఆన్‌లైన్ ఆదాయం రూ. 10.53 కోట్లు కాగా, 2017లో రూ. 15.36 కోట్లు వచ్చిందని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఎస్వీబీసీ ఛానల్ నిర్వహించిన `డయల్ యువర్ ఈఓ` కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విషయాలు వెల్లడించారు. అలాగే గతేడాది 2.73 కోట్ల మంది భక్తులు వచ్చారని, దాదాపు 1,87,000ల కేజీల తలనీలాలు ఇచ్చారని, వాటిని అమ్మగా రూ. 6.39 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు.