కరణ్ జొహార్ టీవీ షోలో కంగనా రనౌత్?
- సాదరంగా ఆహ్వానిస్తానన్న కరణ్
- 'ఇండియాస్ నెక్స్ట్ సూపర్‌స్టార్స్' షోలో సహజడ్జిగా ఉన్న కరణ్
- గతంలో కరణ్ షోలో సంచలన కామెంట్లు చేసిన కంగనా
దీనికి కరణ్ సానుకూలంగా స్పందించడం విశేషం. 'స్టార్ ప్లస్ వారు కంగనాను ఆహ్వానించాలనుకుంటే... వారి నిర్ణయానికి కట్టుబడి తాను కంగనాను సాదరంగా ఆహ్వానిస్తాను' అని కరణ్ అన్నాడు. రోహిత్ శెట్టితో కలిసి కరణ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటికే ప్రియాంక చోప్రా అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. గతంలో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో బాలీవుడ్‌లో స్వాభిమానాన్ని పెంచిపోషించే వ్యక్తిగా కరణ్‌ని అభివర్ణిస్తూ కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత నుంచి వీలు చిక్కినప్పుడల్లా వివిధ కార్యక్రమాల్లో కంగనాను కరణ్ తనదైన రీతిలో కామెంట్లు చేసేవాడు. ఇలా వారిద్దరి మధ్య వివాదం నడిచింది.