విమానంలో భార్యతో ప్రయాణిస్తూ.. మరో అమ్మాయిపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి అమెరికా పోలీసుల అరదండాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానంలో భార్యతో ప్రయాణిస్తూ.. మరో అమ్మాయిపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి అమెరికా పోలీసుల అరదండాలు

  • పక్క సీటులో కూర్చున్న యువతిని వేధించిన వ్యక్తి
  • డెట్రాయిట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయమూర్తి
విమానంలో తన పక్క సీటులో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించిన భారతీయుడిని అమెరికా పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. గురువారం రాత్రి లాస్‌వేగాస్ నుంచి డెట్రాయిట్ వెళ్తున్న విమానంలో ప్రభు రామమూర్తి (34) తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. వారి పక్క సీటులో ఓ యువతి (22) నిద్రిస్తోంది. ఆమె నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించిన రామమూర్తి తనలోని మరో మనిషిని నిద్రలేపాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ, చేతులు వేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె వెంటనే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు.

విమానం డెట్రాయిట్‌లో ల్యాండ్ అవగానే అప్పటికే కాచుక్కూర్చున్న పోలీసులు రామమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిచిగాన్‌ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో రామమూర్తి మరోలా వాదన వినిపించాడు. తాను నిద్రమాత్ర వేసుకుని గాఢ నిద్రలోకి జారుకున్నానని, ఫిర్యాదు చేసిన యువతే తన మోకాళ్లపై పడుకుందని కోర్టుకు తెలియజేశాడు. అయితే అతడి వాదనను న్యాయమూర్తి విశ్వసించలేదు. నిందితుడికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రామమూర్తిని జైలుకు తరలించారు.
America
Indian
Jail
Bail

More Telugu News