నన్ను కొంద‌రు కావాలనే టార్గెట్‌ చేస్తున్నారు: గుజరాత్ దళిత నేత జిగ్నేష్‌

  • మహారాష్ట్రలో ఆందోళనల నేపథ్యంలో జిగ్నేష్ మేవానీ సభకు నో పర్మిషన్
  • బీజేపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయని కామెంట్ 
  • బీజేపీకి 2019 ఎన్నికల భయం పట్టుకుందన్న జిగ్నేష్ 
మహారాష్ట్రలో జరుగుతున్న ఆందోళనలపై తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, త‌న‌ను కొంద‌రు కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత ఉద్యమనేత జిగ్నేష్‌ మేవానీ అన్నారు. ముంబయిలో సభ నిర్వహించేందుకు స‌ద‌రు నేత నిన్న అక్కడికి చేరుకున్నారు. కానీ, ఆయన సభను జరగనీయకుండా పోలీసులు అడ్డుకుని, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

 ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న మీడి‌యాతో మాట్లాడుతూ... స్వ‌యం సేవ‌క్ సంఘ్, బీజేపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయ‌ని ఎద్దేవా చేశారు. వారు త‌న‌ ప్రతిష్ఠను దెబ్బ తీయాలని చూస్తున్నార‌ని, ఇటీవ‌ల జ‌రిగిన‌ గుజరాత్‌ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాక‌పోవ‌డంతో బీజేపీకి 2019 ఎన్నికల భయం పట్టుకుందని అన్నారు. దేశంలో ద‌ళితులపై జరుగుతోన్న దాడుల విష‌యంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాలని ఆయ‌న అన్నారు.
Go Back to Shorts
Gujarath
BJP
Jignesh_Mevani

More Telugu News