సిక్కు వేషధారణలో అక్షయ్ కుమార్.. ఆకట్టుకుంటున్న 'కేసరి' ఫస్ట్‌లుక్
- ట్విట్టర్‌లో షేర్ చేసిన అక్షయ్
- చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం
- 2019 హోలీకి విడుదల
2018లో తన మొదటి ప్రాజెక్టు అంటూ అక్షయ్ ఈ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫస్ట్‌లుక్‌ని పొగడ్తలతో ముంచెత్తుతూ నిర్మాత కరణ్ జొహార్ కూడా ట్వీట్ చేశాడు. 2019 హోలీ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కరణ్ గతంలో ప్రకటించాడు. బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.