2017లో వెంకన్న ఆదాయం రూ. 995.85 కోట్లు... కేవలం హుండీ ద్వారానే!
- రూ. 995.85 కోట్ల హుండీ ఆదాయం
- త్వరలో తిరుపతిలో 2,500 గదులు
- స్వామిని దర్శించుకున్న 2.73 కోట్ల మంది
- వెల్లడించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్
భక్తుల కోసం తిరుపతిలో 2500 గదులను నిర్మించనున్నామని ఆయన వెల్లడించారు. బ్రేక్ దర్శన టిక్కెట్ల ధరను పెంచాలన్న ఆలోచనపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, ప్రభుత్వానికి కూడా ఎలాంటి నివేదికనూ పంపలేదని తెలిపారు. గత సంవత్సరం మొత్తం 2,73,13,897 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 10,66,72,730 లడ్డూలను పంపిణీ చేశామని తెలిపారు.