coal india: కేంద్రానికి కోల్ ఇండియాతో కనకవర్షం!

  • 2020 నాటికి రూ.95,000 కోట్ల ఆదాయం
  • క్లీన్ ఎనర్జీ సెస్సు రూపంలో వసూలు
  • ఇప్పటికే రూ.53,967 కోట్ల ఆదాయం

దేశంలో బొగ్గు ఉత్పత్తిలో నంబర్ 1 కంపెనీ అయిన కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి కల్పతరువుగా మారింది. 2020 నాటికి కేంద్ర ప్రభుత్వానికి కోల్ ఇండియా రూ.95,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చనుంది. బొగ్గు పర్యావరణ పరంగా కలుషితానికి కారణమయ్యే ముడి సరుకు. దీంతో శుద్ధ ఇంధనం సెస్సు రూపంలో కోల్ ఇండియా ఈ మేరకు సర్కారుకు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది బొగ్గుపై సెస్సు రూపంలో రూ.26,400 కోట్లు, వచ్చే ఏడాది రూ.30,920 కోట్లు, 2020లో రూ.40,000 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం వసూలు చేయనుంది. కాగ్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లీన్ ఎనర్జీ సెస్సు కింద 2010-11 నుంచి 2016-17 మధ్య రూ.53,967 కోట్లను కోల్ ఇండియా నుంచి వసూలు చేసింది. కేంద్ర సర్కారు గతంలోనే క్లీన్ ఎనర్జీ ఫండ్ ను ఏర్పాటు చేసింది. శుద్ధ ఇంధన టెక్నాలజీలపై పరిశోధనలకు ఇది ప్రోత్సాహం ఇస్తుంది. 

More Telugu News