విమానంలో సహ ఉద్యోగినికి ప్రపోజ్ చేసిన పైలట్... ఆకట్టుకుంటున్న వీడియో!
- విమాన ప్రకటనలో భాగంగా లవ్ విషయం వెల్లడి
- ప్రయాణికుల సమక్షంలో ప్రపోజ్ చేసిన పైలట్ ఎమర్సన్
- వైరల్ అవుతున్న వీడియో
డిసెంబర్ 23న పైలట్ జాన్ ఎమర్సన్, ఫ్లైట్ అటెండెంట్ లారెన్ గిబ్స్‌లు డెట్రాయిట్ నుంచి ఒక్లాహామా సిటీకి వెళ్తున్న విమానంలో తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. విమాన ప్రయాణం గురించి మైకులో ఎమర్సన్ ప్రయాణికులకు సూచనలు చేస్తున్నాడు. ఆ సూచనల్లో భాగంగా లారెన్ గురించి ప్రస్తావించాడు. అంతేకాకుండా అదే ప్రకటనలో భాగంగా లారెన్‌కి ప్రపోజ్ చేశాడు. దీంతో పక్కనే ఉన్న లారెన్ పొంగిపోయింది. ఆమె ఎమర్సన్ ప్రపోజల్‌కి అంగీకరించగానే, ప్రయాణికులంతా లేచి చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.