catherine: కేథరిన్ ను అలీ సరదాగా అడిగిన ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
"సాధారణంగా హీరోతో హీరోయిన్ ఒక సినిమా చేస్తే, మళ్లీ ఎప్పుడో గానీ వాళ్ల సరసన ఛాన్స్ రాదు. అలా కాకుండా 'ఇద్దరమ్మాయిలతో'.. 'రుద్రమదేవి' .. 'సరైనోడు' మూడు సినిమాలు ఓకే హీరోతో చేశారు. ఇది హీరో రికమెండేషనా? డైరెక్టర్ రికమెండేషనా?" అంటూ కేథరిన్ ను అలీ సరదాగా అడిగారు.

 అందుకు ఆమె స్పందిస్తూ ' 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో ఆ పాత్ర కోసం నేను ఫిట్ అనుకుని పూరీగారు తీసుకున్నారు. 'రుద్రమదేవి' సినిమాలో నేను చేసింది గెస్ట్ రోల్. ఆ ప్రాజెక్టు చివరిలో అల్లు అర్జున్ వచ్చాడు. 'సరైనోడు' సినిమాకి నన్ను తీసుకోవడమనేది బోయపాటిగారి నిర్ణయం. ఆ రోల్ కోసం నేను కరెక్ట్ ఛాయిస్ అని ఆయన అనుకోవడం వలన తీసుకున్నారు. ఆ సినిమాలోని పాత్ర నాకు ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చింది" అంటూ చెప్పుకొచ్చింది.  
Go Back to Shorts
catherine

More Telugu News