pavan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అజ్ఞాతవాసి' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి దీనికి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ నెల 10న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.      
*  మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెల 7 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఈ షెడ్యూలులో ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.  
*  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి  న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్ లో జరుపుకున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ తన తండ్రి హీరోగా 'సై' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. త్వరలోనే వీరిద్దరూ హైదరాబాదుకి తిరిగి వస్తారు.
*  మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యాడు. విష్ణు, విరోనిక  దంపతులకు న్యూ ఇయర్ రోజున పండంటి బాబు పుట్టాడు. ఇప్పటికే వీరికి ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) వున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
pavan
Mahesh Babu

More Telugu News