ప్రధాని నరేంద్రమోదీని కలిసిన విజయసాయిరెడ్డి.. ‘ప్రజాసంకల్ప యాత్ర’పై చర్చ!
- పార్లమెంట్ సమావేశాల టీ బ్రేక్ సమయంలో మోదీతో భేటీ
- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపుపై ప్రధానికి అభినందనలు
- ఏపీ రాజకీయాలు, జగన్ ప్రజా సంకల్ప యాత్రపై చర్చ
మోదీని తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు విజయసాయి చెబుతున్నప్పటికీ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఏపీ ప్రభుత్వం కొంత అసంతృప్తిగా ఉంది. దీనికి తోడు అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో విజయసాయి రెడ్డికి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.