KTR: మంత్రి కేటీఆర్‌పై అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సును స‌మ‌ర్థ‌వంతంగా నిర్వహించినందుకు గానూ అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌ పై ప్రశంసలు కురిపించారు. సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ను కలిసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అమెరికా అంబాసిడర్ కెన్నెత్ మంత్రి కేటీఆర్‌ కు లేఖ రాశారు.

జీఈ సదస్సు విజయవంతమైనందుకు లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా ఏర్పాట్లు చేయడం వల్లే సదస్సు అర్థవంతంగా సాగిందని కితాబిచ్చారు. తెలంగాణను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు అద్భుతమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్ పాలసీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ పేర్కొన్నారు. 
Go Back to Shorts
KTR
america
ge
Hyderabad

More Telugu News