kaikalur: కైకలూరులో పేకాట దందా.. ఎంపీ మాగంటి బాబు కార్యాలయానికి వెళ్లిన పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
కృష్ణా జిల్లా కైకలూరులో టీడీపీ నేత, ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో పేకాట దందా నడుస్తోందనే వార్తలు మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో మాగంటి బాబు కార్యాలయంలో సోదాల నిమిత్తం పోలీసులు అక్కడికి వెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎంపీ కార్యాలయానికి డీఎస్పీ, సీఐ వెళ్లారు.

అయితే, ఆ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, వారానికి కోట్ల రూపాయల్లో పేకాట దందాను ఈ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు ఇక్కడికి వస్తున్నట్టు మీడియాలో వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే.
Go Back to Shorts
kaikalur
krishna

More Telugu News