venkatesh: సాయిధరమ్ తేజ్ ప్లేస్ లో వరుణ్ తేజ్!

షార్ట్స్‌లో చూడండి
అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతూ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటివరకూ మాస్ ఆడియన్స్ ను అలరిస్తూ వచ్చిన ఆయన, ఈసారి మరో వైవిధ్యభరితమైన కథాంశంతో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటున్నాడు.

దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ ను ఎంపిక చేసుకున్న ఆయన, మరో హీరోగా రానాను తీసుకోవాలనుకున్నాడుగానీ కుదరలేదు. దాంతో సాయిధరమ్ తేజ్ కోసం గట్టి ప్రయత్నమే చేశాడు. అయితే ఆయన అప్పటికే వరుస సినిమాలను కమిట్ కావడంతో, డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పాడట. దాంతో ఆ ప్లేస్ లో వరుణ్ తేజ్ ను తీసుకోవాలని భావించిన దిల్ రాజు, ఆయనతో మాట్లాడి ఒప్పించాడని సమాచారం. ఇక వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతో సెట్స్ పైకి వెళ్లడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడట.        
Go Back to Shorts
venkatesh
varun thej

More Telugu News