జూబ్లీహిల్స్ లో కారు బోల్తా.. స్వల్పంగా గాయపడ్డ సినీ నటుడు ఆర్కే!
- ఆర్కే ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న మరో కారు
- వేగంగా కారును డ్రైవ్ చేస్తూ, ప్రమాదానికి కారణమైన మహిళ
- అపోలో ఆసుపత్రికి తరలింపు
అక్కడున్న స్థానికులు ఆర్కేను కారు నుంచి బయటకు తీశారు. గాయపడ్డ ఆర్కేను అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును ఓ మహిళ నడిపింది. టర్నింగ్ వద్ద వేగంగా నడపడంతో, కారు అదుపు తప్పిందని, ఆర్కే కారును ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.