Puri Jagannadh: నా తొలి షార్ట్ ఫిలింను త్వరలో విడుదల చేస్తాను: దర్శకుడు పూరీ జగన్నాథ్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తన తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 31న ఉదయం పది గంటలకు ‘హగ్’ ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ‘గెట్ రెడీ ఫర్ దిస్ వన్’ అంటూ తన అభిమానులకు ఈ విషయాన్ని తన ట్వీట్ ద్వారా పూరీ చెప్పారు. కాగా, తనయుడు ఆకాశ్ తో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘మెహబూబా’ చిత్రం రూపొందుతోంది. ఆకాశ్ సరసన నేహాశెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Puri Jagannadh
shortfilm

More Telugu News