జయలలితతోనే గొడవ వచ్చింది .. షూటింగ్ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాను: జమున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జయలలితతోనే గొడవ వచ్చింది .. షూటింగ్ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాను: జమున

  • నేను .. జయలలిత 'శ్రీకృష్ణ విజయం' చేశాము 
  • రిహార్సల్స్ కి ఆమె సహకరించలేదు 
  • దర్శకుడికి చెప్పినా పట్టించుకోలేదు 
  • ఆ తరువాత జయలలిత మంచి ఫ్రెండ్ అయింది
"ఎప్పుడైనా మీకు గానీ .. మీ కో ఆర్టిస్టులకు గాని .. దర్శకులతో గానీ .. హీరోలతో గాని గొడవ వచ్చిందా? మీరు గానీ .. వాళ్లు గాని అలిగి బయటికి వెళ్లిపోవడం జరిగిందా?" అనే ప్రశ్న 'అలీతో సరదాగా' కార్యక్రమంలో జమునకు ఎదురైంది. అందుకామె స్పందిస్తూ .. " మహా పెద్దావిడతోనే గొడవ వచ్చింది .. తమిళనాడును ఒక ఊపు ఊపేసిన మా అందాల నటి .. జయలలితతోనే వచ్చింది"

"జయలలిత .. నేను 'శ్రీకృష్ణ విజయం' అనే సినిమాలో చేస్తున్నాము. కమలాకర కామేశ్వర రావు దర్శకుడు. ఇద్దరం ఒక సెట్లో రిహార్సల్స్ చేస్తున్నాం. ఆ అమ్మాయిది అహంకారం కాదు గానీ .. అదొక టైపు ..అంతే. ఆ తరువాత బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అనుకోండి. "అమ్మా డైలాగ్ చెప్పమ్మా అంటే .. 'నేనెందుకు చెప్పాలి .. మీరే చేసుకోండి' అంది. దాంతో 'ఏంటండీ డైరెక్టర్ గారు ఆ అమ్మాయి డైలాగ్ చెప్పకపోతే నేనెలా చెప్పాలి .. రిహార్సల్ కి" అన్నాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. నాకు కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను .. మేకప్ తీసేసి వెళ్లిపోతానని చెప్పాను. అప్పుడు దర్శక నిర్మాతలు వచ్చి నచ్చజెప్పారు" అంటూ చెప్పుకొచ్చారు
jamuna
jayalalitha

More Telugu News